సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “రిపబ్లిక్”. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు దేవాకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సాయితేజ్ ప్రభుత్వ అధికారిగా నటిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం రాజకీయాలు ప్రస్తుత పరిస్థితుల చుట్టూ తిరుగుతుంది. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుండగా… ఇందులో జగపతి బాబు, రమ్య కృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొంతకాలం క్రితం విడుదలైన ‘రిపబ్లిక్’ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఇప్పటికే…
తెలుగు హీరోల హిందీ అనువాద చిత్రాలకు ఉత్తరాదిన భలే క్రేజ్ ఉంటుంది. ఇవి థియేట్రికల్ రిలీజ్ కాకపోయినా, శాటిలైట్ ఛానెల్స్ లోనూ, యూ ట్యూబ్ లోనూ ప్రసారం కాగానే విశేష ఆదరణ లభిస్తుంటుంది. లక్షలాది మంది వాటిని చూడటమే కాదు… లైక్ చేసి తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. అలా సాయిధరమ్ తేజ్ నటించిన సినిమాలు రెండు ఇప్పటికే 1 మిలియన్ లైక్స్ ను పొందాయి. ఆ మధ్య సాయి తేజ్ నటించిన తేజ్ ఐ లవ్…
ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా క్రేజ్ ను సొంతం చేసుకుంది ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో మెగా హీరోతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయనుందనే వార్తలు విన్పిస్తున్నాయి. డైరెక్టర్ కార్తీక్ వర్మ దర్శకత్వంలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. తాజా అప్‌డేట్ ప్రకారం అధిక బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని సుకుమార్, బివిఎస్‌ఎన్ ప్రసాద్ సంయుక్తంగా…
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఒకవైపు కరోనా కేసులు కంట్రోల్ చేసేందుకు లాక్ డౌన్, కర్ఫ్యూ అమలు చేస్తూనే, మరోవైపు వ్యాక్సిన్ అందిస్తున్నారు.అయితే సెకండ్ వేవ్ లో మరీ దారుణంగా ఉంది పరిస్థితి. ముఖ్యంగా సెలబ్రిటీలు సైతం కరోనా మహమ్మారి కారణంగా తమ ఆత్మీయులను పోగొట్టుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా భారతీయ సినిమా పరిశ్రమ పలువురు నటీనటులతో పాటు ప్రముఖ దర్శకులు, నిర్మాతలను సైతం కోల్పోయింది. తాజాగా టాలీవుడ్ వర్ధమాన దర్శకుడు సుబ్బు తల్లి కరోనాతో కన్నుమూశారు.…
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘చిత్రలహరి’ మూవీ హిందీ డబ్బింగ్ వర్షన్ 100 మిలియన్ వ్యూస్ దాటేసింది. 100 మిలియన్ వ్యూస్ కే రికార్డా అనుకోకండి… ఎందుకంటే హిందీలో డబ్ అయిన సాయి ధరమ్ తేజ్ చిత్రాల్లో ఏకంగా 3 సినిమాలు 100 మిలియన్ వ్యూస్ దాటేశాయి. అదీ విశేషం. ఇక సాయి ధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శిని జంటగా నటించిన ‘చిత్రలహరి’ హిందీలో ‘ప్రేమమ్’…
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన పేరుతో చీటింగ్ కు పాల్పడుతున్న వ్యక్తిపై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యాడు. ఒక వ్యక్తి నా పేరుతో చీటింగ్ కు పాల్పడుతున్నాడని నా దృష్టికి వచ్చింది. అతను నాతో పాటు సినిమాల్లో నటించిన వారి నుంచి, ఇతరుల నుంచి ఆర్థిక సహాయం కోరుతున్నట్టు తెలిసింది. నా వైపు నుంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాను. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోండి. అలాంటి వ్యక్తులతో సంభాషించకండి’ అంటూ తన అభిమానులను…
డాక్టర్ విక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది బర్త్ 10000 బీసీ’. రానా ప్రతాప్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శ్రీ వినాయక మారుతి క్రియేషన్స్, లక్ష ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రదీప్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జుడా సంధి సంగీతం అందిస్తున్నారు. కన్నడ భాషలో తెరకెక్కుతున్న ఆ యాక్షన్ థ్రిల్లర్ ను తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు మంచి స్పందన వచ్చింది.…
లేటెస్ట్ బైక్ లపై యూత్ ఎంత మక్కువ చూపిస్తారో అందరికీ తెలిసిందే. ఇక హై పర్ఫార్మెన్స్ బైక్ లు అంటే విపరీతంగా ఇష్టపడతారు. తాజాగా అలాంటి ఓ బైక్ నే లాంచ్ చేశారు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. హైదరాబాద్‌లో హై పర్ఫార్మన్స్ బైక్ ట్రయంఫ్ ట్రైడెంట్ 660ని లాంచ్ చేశారు సాయి తేజ్. బ్రిటిష్ ప్రీమియం మోటార్ సైకిల్ బ్రాండ్ ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఆల్-న్యూ ట్రైడెంట్ 660 భారతదేశంలో రూ .6.95 లక్షలు…