లేటెస్ట్ బైక్ లపై యూత్ ఎంత మక్కువ చూపిస్తారో అందరికీ తెలిసిందే. ఇక హై పర్ఫార్మెన్స్ బైక్ లు అంటే విపరీతంగా ఇష్టపడతారు. తాజాగా అలాంటి ఓ బైక్ నే లాంచ్ చేశారు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. హైదరాబాద్‌లో హై పర్ఫార్మన్స్ బైక్ ట్రయంఫ్ ట్రైడెంట్ 660ని లాంచ్ చేశారు సాయి తేజ్. బ్రిటిష్ ప్రీమియం మోటార్ సైకిల్ బ్రాండ్ ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఆల్-న్యూ ట్రైడెంట్ 660 భారతదేశంలో రూ .6.95 లక్షలు (ఎక్స్-షోరూమ్ ధర). ట్రయంఫ్ ట్రైడెంట్ 660 బైక్ ట్రిపుల్ సిలిండర్ 660 సిసి ఇంజిన్‌తో 81 పిఎస్ @ 10,250 ఆర్‌పిఎమ్ గరిష్ట శక్తితో, 64 ఎన్‌ఎమ్ @ 6250 ఆర్‌పిఎమ్ టార్క్ కలిగి ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ట్రయంఫ్ ట్రైడెంట్ 660 బైక్ 660 సిసి, ఇన్లైన్ ట్రిపుల్-సిలిండర్ ఇంజిన్‌తో పని చేస్తుంది. టూ రైడ్ మోడ్స్ రోడ్ అండ్ రెయిన్ స్విచ్ చేయగల ట్రాక్షన్ కంట్రోల్, థొరెటల్-బై-వైర్ వంటి రెండు ఎలక్ట్రానిక్ ఎయిడ్స్ కలిగి ఉంటుంది. ట్రయండ్ మోటార్ సైకిల్స్ ట్రైడెంట్‌తో కొన్ని ఆప్షనల్ యాక్ససరీస్ కూడా అందిస్తున్నాయి. కాగా సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం పొలిటికల్ డ్రామా “రిపబ్లిక్” చిత్రంలో నటిస్తున్నారు. దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ ఐఎఎస్ అధికారిగా కన్పించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ‘రిపబ్లిక్’ మూవీని జేబి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా… ఈ ఏడాది జూన్ 4 చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అయితే కరోనా సెకండ్ వేవ్ వణికిస్తున్న నేపథ్యంలో సినిమా విడుదలపై ప్రేక్షకుల్లో సందేహం నెలకొంది. ఇప్పటికే టాలీవుడ్ లోని పలు పెద్ద సినిమాలు సైతం విడుదలను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే.