ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా క్రేజ్ ను సొంతం చేసుకుంది ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో మెగా హీరోతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయనుందనే వార్తలు విన్పిస్తున్నాయి. డైరెక్టర్ కార్తీక్ వర్మ దర్శకత్వంలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. తాజా అప్‌డేట్ ప్రకారం అధిక బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని సుకుమార్, బివిఎస్‌ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం మేకర్స్ కృతిశెట్టిని సంప్రదించినట్లు టాక్. కృతి శెట్టి ‘ఉప్పెన’ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తో కలిసి రొమాన్స్ పండించింది. మరిప్పుడు అన్న సాయి ధరమ్ తేజ్ తో కలిసి కన్పించబోతుందా ? లేదా ? అన్నది చూడాలి. ప్రస్తుతం కీర్తి సురేష్ ఖాతాలో దాదాపు నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇక సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘రిపబ్లిక్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు దర్శకుడు కార్తీక్ వర్మ “భమ్ బోలేనాథ్” చిత్రంతో పరాజయం చవి చూశారు. మరి ఈ చిత్రంతోనైనా కార్తీక్ హిట్ అందుకుంటారేమో చూడాలి.