గుంటూరు జిల్లా తెనాలిలో రౌడీషీటర్ నవీన్ దాడితో బ్రెయిన్‌డెడ్ కు గురై చికిత్స పొందుతూ మృతి చెందిన మధిర సహన కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఆ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా ప్రకటించిన రూ.10 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఈ రోజు.. ఆ కుటుంబానికి అందజేశారు గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు..
గుంటూరు ప్రభుత్వ హాస్పటల్‌లో సహన కుటుంబ సభ్యులను పరామర్శించారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అయితే, జగన్ చూసేందుకు భారీగా వైసీపీ కార్యకర్తలు రావడంతో తోపులాట జరిగింది.. ఇక, ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్.. కూటమి ప్రభుత్వంలో అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో నా దళిత చెల్లి మరణం చూస్తే అర్ధం అవుతుందన్నారు.