Etela Rajender : ఢిల్లీలో బీజేపీ ఎంపీల బృందం కేంద్ర మంత్రులను కలిసి పలు సమస్యలను ప్రస్తావించింది. ఎంపీ ఈటల రాజేందర్ సహా పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సఫాయి కర్మచారుల సమస్యల నుండి రైల్వే అభివృద్ధి ప్రాజెక్టుల వరకు విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈటల రాజేందర్ మాట్లాడుతూ, సఫాయి కర్మచారీలు కేవలం 40 ఏళ్లకే అనేక ఆరోగ్య సమస్యలతో మరణిస్తున్న పరిస్థితి చాలా బాధాకరమని అన్నారు. కరోనా సమయంలో వీరి సేవలను గుర్తించి ప్రధాని…