South Africa: రాంచీలో నేడు భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. అయితే రెండో వన్డే ప్రారంభానికి ముందు దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ విషాద వార్తను అభిమానులతో పంచుకున్నాడు. క్యాన్సర్‌తో పోరాడుతూ మిల్లర్ కుమార్తె శనివారం నాడు మృతి చెందింది. మిల్లర్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ మేరకు ‘రిప్ మై లిటిల్ రాక్‌స్టార్.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నిన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా’ అని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. అయితే…
Suryalanka: బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీర ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వచ్చి ముగ్గురు యువకులు మృతి చెందారు. మరో ముగ్గురు గల్లంతు అయ్యినట్లు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం జాలర్లతో కలిసి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. బాధితులు విజయవాడ సింగ్ నగర్‌కు చెందిన విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. Read Also: Y. S. Sharmila: మరోసారి ఫైర్.. పండిత పుత్ర…
చిరకాల మిత్రుడు అకస్మాత్తుగా కన్నుమూస్తే ఆ బాధ మామూలుగా వుండదు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో తన చిరకాల మిత్రుడు ఆకస్మికంగా మృతి చెందటంతో నివాళులు అర్పించి అంతిమయాత్రలో పాల్గొని పాడే మోసి కడవరకు సాగనంపారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. సత్తుపల్లి పట్టణ ప్రముఖులు సత్తుపల్లి మాజీ ఉపసర్పంచ్, మాజీ కౌన్సిలర్ తుళ్లూరు ప్రసాద్ గుండెపోటుతో మృతి చెందారు. తుళ్లూరు ప్రసాద్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి సన్నిహితులు. ఇద్దరూ ఎంతో స్నేహంగా మెలిగేవారు.…
టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు శరత్ శుక్రవారం ఉదయం అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. తెలుగులో ఆయన దాదాపు 20 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘డియర్’ అనే నవల ఆధారంగా ‘చాదస్తపు మొగుడు’ అనే సినిమాతో ఇండస్ట్రీకి శరత్ పరిచయం అయ్యారు. బాలకృష్ణ, సుమన్ హీరోలుగా సినిమాలు తెరకెక్కించి భారీ విజయాలు సాధించారు. ఏఎన్నార్‌తో ‘కాలేజీ బుల్లోడు’, జగపతిబాబుతో ‘భలే బుల్లోడు’, బాలకృష్ణతో వంశానికొక్కడు, పెద్దన్నయ్య,…
ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లాలో బుధవారం విషాద సంఘటన చోటుచేసుకుంది. చాక్లెట్లు తిని నలుగురు చిన్నారులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కాశ్య ప్రాంతంలోని దిలీప్ నగర్‌లో ఉన్న ఓ ఇంటి ముందు ప్లాస్టిక్ బ్యాగ్ దొరికింది. ఓ మహిళ ఆ బ్యాగ్‌ను తెరిచి చూడగా అందులో ఐదు చాక్లెట్లు, కొన్ని నాణేలు ఉన్నాయి. అయితే ఆ చాక్లెట్లను ఆమె తన ముగ్గురు మనవళ్లకు, పక్కింట్లో నివసిస్తున్న మరో చిన్నారికి ఇచ్చింది. ఆ చాక్లెట్లు తిన్న కాసేపటికే పిల్లలు…
టాలీవుడ్‌కు మరో సీనియర్ నటుడు దూరమయ్యారు. ముత్యాల ముగ్గు ఫేం నటుడు పి.వెంకటేశ్వరరావు (90) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ ఈరోజు ఆయన కన్నుమూశారు. రంగస్థల కళాకారుడిగా పలు నాటకాల్లో నటించిన వెంకటేశ్వరరావు 1965లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన తేనెమనసులు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ఏడాదిలోనే మళ్లీ కృష్ణ నటించిన కన్నె మనసులు చిత్రంలో నటించారు. అయితే 1975లో లెజెండ్రీ డైరెక్టర్…
మహా శివరాత్రినాడు విషాదం నెలకొంది. పర్వదినం సందర్భంగా గోదావరి స్నానానికి వెళ్ళి ఓ యువకుడు గల్లంతయ్యాడు. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం బిల్ట్ ఇంటెక్వెల్ సమీపంలోఈ సంఘటన జరిగింది. గల్లంతయిన యువకుడిని భూక్యా సాయి(20 )గా బంధువులు గుర్తించారు. అతని మృతదేహం లభించడంలో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కమలాపురం టీడీపీ కాలనీకి చెందిన భూక్య సాయి తమ బంధువులు, చట్టుప్రక్కల ఇళ్ళవారితో కలిసి మంగళవారం ఉదయం గోదావరి స్నానం చేయడం కోసం వెళ్ళారు. గోదావరిలో…
టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా నివాసంలో విషాదం నెలకొంది. రైనా తండ్రి త్రిలోక్‌చంద్ రైనా ఆదివారం ఘాజియాబాద్‌లోని స్వగృహంలో మరణించారు. కొన్నిరోజులుగా ఆయన క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. త్రిలోక్ చంద్ గతంలో మిలటరీ అధికారిగా పనిచేశారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో బాంబులు తయారు చేయడంలో ఆయన దిట్ట. ఆయన పూర్వీకులది జమ్ముకాశ్మీర్‌లోని రైనావరి గ్రామం. 1990లలో కశ్మీరీ పండిట్ల హత్యల ఘటన అనంతరం ఆ గ్రామాన్ని విడిచిపెట్టారు. అనంతరం యూపీలోని మురాద్‌నగర్‌లో స్థిరపడ్డారు. Read Also: లతా మంగేష్కర్‌కు…