తమిళనాడులో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. దీపావళి వేళ కుటుంబంతో ఎంతో ఆనందంగా టపాసులు కాల్చుదామని టపాసులు కొనుకొన్ని తన కుమారుడితో ఇంటికి వెళ్తుండగా ఉన్నంటుండి ఆ టపాసులు పేలడంతో ఆ తండ్రీకొడుకులు మరణించారు. ఈ హృదయవిదారక ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. పుదిచ్చేరికి చెందిన కలైనేషన్ (35) అనే వ్యక్తి విల్లుపురంలోని తన అత్తగారింట్లో దీపావళి వేడుకలు జరుపుకునేందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో కలైనేషన్ తన కుమారుడు ప్రదేశ్ (7)తో…
కర్నూలు జిల్లా నంద్యాలలోని ప్రియాంకనగర్‌లో విషాదం నెలకొంది. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఒకరు మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో స్థానికులు వారిని వెంటనే ఆస్ప్రత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి వైఎస్ఆర్ నగర్‌కు చెందిన గోవింద్‌గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Read Also: ఇలానే కొనసాగితే… వాటికి ముప్పు…
సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామంలోని ఓ ఇంట్లో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో ఇంట్లో ఉన్న రూ.10 లక్షల నగదు కాలి బూడిదైంది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కష్టపడి సంపాదించుకున్న సొమ్ము మంటల్లో కాలిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. నేలమర్రి గ్రామానికి చెందిన సన్నకారు రైతు కప్పల లక్ష్మయ్యకు రెండు ఎకరాల పొలం ఉంది. నాలుగు రోజుల క్రితం తన తండ్రికి చెందిన ఆస్తి అమ్మడంతో…