బాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్, గాయకుడు సచిన్ సాంఘ్వీ అరెస్ట్ అయ్యాడు. లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై శుక్రవారం అతడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. మ్యూజిక్ ఆల్బమ్‌లో ఛాన్స్ ఇస్తానని, వివాహం చేసుకుంటానని చెప్పి సచిన్ సాంఘ్వీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. మహిళ ఫిర్యాదుతో సాంఘ్వీని అరెస్టు చేసినట్లు ఒక పోలీసు అధికారి ధ్రువీకరించారు. అయితే అతడు బెయిల్‌పై విడుదల అయ్యాడు. ‘ఫిబ్రవరి 2024లో సచిన్ సంఘ్వితో పరిచయం…