సబితం జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు ప్రవాహంలో జారిపడి మృతిచెందాడు. కరీంనగర్ టౌన్ కిసాన్ నగర్‌కు చెందిన మానుపాటి వెంకటేష్(23), స్నేహితులతో కలిసి జలపాతం సందర్శనకు వచ్చారు. అయితే అక్కడ ప్రమాదవశాత్తు రాళ్లపై జారీ పడటంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.