నేడు తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. గత నెల మే 6వ తేదీన మొదలైన ఇంటర్మీడియట్ పరీక్షలు మే 23న ముగిసిన విషయం తెలిసిందే. కాగా.. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైన విషయం తెలిసిందే.. విద్యార్థులు ఇంటర్ రిజల్ట్స్‌ని తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్…
బాసర ట్రిపుల్ ఐటీలో గత మూడురోజులుగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన చేస్తుండటంపై గవర్నర్ తమిళి సై సౌందర్యరాజన్ స్పందించారు. ఆమె ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. టీఎస్ సీఎంవో కు తమిళి సై ట్యాగ్ చేశారు. తల్లిదండ్రుల కలలు, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. వర్షంలోనూ తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులను చూసి తమిళిసై ఆవేదన చెందారు. తాను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.…
బీజేపీకి రాజీనామా చేసి మంత్రి సబితా రెడ్డి సమక్షంలో బిజెపి సర్పంచ్ అనిత శ్రీనివాస్ టిఆర్ఎస్ పార్టీలో చేరారు. బిజెపి సర్పంచ్ అనిత శ్రీనివాస్ ను టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సాదరంగా ఆహ్వానించారు. శ్రీనగర్ కాలనీలోని మంత్రి నివాసంలో పెద్ద ఎత్తున అనుచరులతో టి ఆర్ ఎస్ లో చేరిన బీజేపీ సర్పంచ్ ను టి ఆర్ ఎస్ కండువా కప్పి సాధారంగా పార్టీలోకి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆహ్వానించారు. ఈ…