తెలంగాణాలో ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదలకు సన్నాహాలు మొదలయ్యాయి. రేపు మంగళవారం (28వ తేదీన) రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల ప్రకటించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు విడుదల ప్రకియ కొనసాగనుంది. కాగా.. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను మే 6వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించారు. 9.07 లక్షల మంది విధ్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో ఉన్నారు. అయితే ఈ ఫలితాలను https://tsbie.cgg.gov.in, https://results.cgg.gov.in, https://examresults.ts.nic.in అనే…
గత మూడురోజులుగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ (నాలుగోరోజు)కూడా ఆందోళనకు సిద్దమవుతున్న నేపథ్యంలో బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. విద్యార్థుల సమస్యలు స్వయంగా తెలుసుకోవడానికి బాసర ట్రిపుల్ ఐటీ వద్దకు వెళ్లనున్నారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులను కలిసి వారి సమస్యలను, డిమాండ్లను బండి సంజయ్ తెలుసుకోనున్నారు. కాగా.. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన నాలుగోరోజుకు చేరింది. నిన్న బాసర ట్రిపుల్…
పర్యావరణ హితం, దేశ వ్యాప్తంగా పచ్చదనం కోరుకుంటూ మొదలైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఐదవ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. వానాకాలం సీజన్ తోనే మొక్కలు నాటే ఉద్యమం మొదలు కాబోతోంది. ఇవాళ (గురువారం) శంషాబాద్ సమీపంలోని (ముచ్చింతల్ రోడ్) గొల్లూరు ఫారెస్ట్ పార్క్ లో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమౌతుంది. పుడమిని రక్షించుకుందాం, నేల తల్లి మరింత క్షీణించకుండా కాపాడుకుందాం అంటూ సేవ్ సాయిల్ (Save Soil) ఉద్యమంతో…
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. బాసర ట్రిపుల్ ఐటీ ప్రతిష్టను దెబ్బతీయవద్దని ఆమె విద్యార్థులను కోరారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే వీసీకి సమాచారం అందించాలని తెలిపారు. రెండేళ్ల నుంచి యూనివర్సిటీ, స్కూళ్లు సరిగా నడవలేదని.. రెండేళ్ల నుంచి కరోనా వల్ల ఇబ్బందులు తలెత్తాయని..త్వరలోనే ట్రిపుల్ ఐటీలో సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని అన్నారు. విద్యార్థులు పెట్టిన 12 డిమాండ్లు సిల్లీగా ఉన్నాయని..చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవన్నీ ప్రభుత్వం…
రాష్ట్ర వ్యాప్తంగా బడిగంట మోగింది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలులు (Schools) పునఃప్రారంభమయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలోని 41,392 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి తెరచుకున్నాయి. దీంతో విద్యార్థులు మళ్లీ పుస్తకాలు చేతపట్టుకుని హుశారుగా తరగతులకు హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో పాఠశాలలను పూర్తిస్థాయిలో శానిటైజేషన్ చేశారు. కాగా.. స్కూల్స్ రీ ఓపెన్ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నగరంలోని మెహబూబియా స్కూల్‌ను సందర్శించారు. విద్యార్థులకు చాక్లెట్లు ఇచ్చి వెల్ కమ్ చెప్పారు. అనంతరం సబితారెడ్డి…
వేసవి సెలవుల అనంతరం ఇవాల్టి నుంచి సోమవారం (జూన్ 13) నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి తెరచుకుంటున్నాయి. సుమారు 60 లక్షల మంది విద్యార్ధులు బడిబాట పట్టనున్నారు. కోవిడ్ కేసుల పెరుగుదల, పుస్తకాల పంపిణీ పూర్తవకపోవడం, వేసవి తీవ్రత ఇంకా కొనసాగుతన్న నేపథ్యంలో సెలవులు పొడిగిస్తారన్న ప్రచారం జరిగినా.. ఆ ఊహాగానాలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెరదించారు. జూన్ 13వ తేదీ నుంచి యథావిథిగా పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని స్పష్టం చేసారు.…
ఓ వైపు కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం మళ్లీ తల్లిదండ్రుల్లో ఆందోళనలు పెంచుతున్నాయి. ఈ ఏడాది కూడా తమ పిల్లల చదువులు అంతంత మాత్రంగానే సాగుతాయా.? అనే భయాందోళల్లో తల్లిదండ్రులు ఉన్నారు. రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం అవుతాయా.? లేదా.? అనే సందేహాలు తలెత్తాయి. అయితే జూన్ 13 నుంచి యాథాతథంగా స్కూళ్లు ప్రారంభం అవుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. సెలవులను పొడగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపటి నుంచి…
మీర్పేట్ రహదారిపై ఉద్రిక్తత చోటుచేసుకుంది. NSUI నాయకులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. టెట్ పరీక్షను వెంటనే వాయిదా వేయ్యాలని డిమాండ్ చేశారు. మీర్పేట్లో కార్యక్రమంలో మంత్రిని కలిసి వినతి పత్రాన్ని NSUI నాయకులు అందించే ప్రయత్నం చేశారు. మంత్రిని కలవడానికి అవకాశం ఇవ్వకపోవడంతో కాన్వాయ్కి అడ్డుపడ్డారు. దీంతో మీర్పేట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా NSUI అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సహా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి మీర్పేట్ స్టేషన్‌కు తరలించారు.…