Sabari – Godavari Floods: మరోసారి గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది.. శబరి – గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. దాదాపు 100 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల్లో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి శబరి – గోదావరి నదులు.. దీంతో, కూనవరం వద్ద 47.75 అడుగులతో ప్రమాదకర స్థాయికి చేరింది గోదావరి నీటిమట్టం.. కూనవరం మండలం పంద్రాజుపల్లి వద్ద రోడ్డుపై ప్రవహిస్తోంది వరద నీరు. భాస్కర కాలనీ, గిన్నెల బజార్ లో ఇళ్లలోకి వరద…
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు గ్రామానికి వరద తాకిడి ఎక్కువైంది, చింతూరు వద్ద శభరి నది ప్రమాదకరస్థాయిలో 45 అడుగులతో ఉరకలు వేస్తుండగా, కూనవరం వద్ద శబరి 38 అడుగులకు పెరిగింది. చింతూరు మెయిన్ సెంటర్‌లోకి వరద నీటి ప్రవాహం చేరడంతో ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.
గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. శబరి నది గోదావరిలో సంగమించే ప్రదేశమైన కూనవరం వద్ద గోదావరి వేగంగా పెరుగుతోంది. కూనవరం వద్ద గోదావరి ప్రస్తుతం 51 అడుగుల నీటిమట్టంతో ప్రవహిస్తోంది.చింతూరు వద్ద 40 అడుగులకు శబరి నది పెరిగింది. కూనవరం సంగమం వద్ద శబరి - గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.