యాక్షన్ చిత్రాలతో నటుడిగా తమిళ, తెలుగు భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశాల్ ఇప్పుడు మరో యాక్షన్ డ్రామా ‘సామాన్యుడు’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తు పా శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది. తాజాగా ‘సామాన్యుడు’ టీజర్ ను ఈరోజు విడుదల చేశారు మేకర్స్. టీజర్ పూర్తిగా విశాల్ యాక్షన్ తో నిండిపోయింది. అధికారంలో ఉన్న వ్యక్తులపై సామాన్యులు చేసే పోరాటమే ఈ సినిమా అని టీజర్ ద్వారా స్పష్టం…