రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధంలో ఇరుదేశాలు భారీ నష్టాన్నే చవిచూశాయి. ఉక్రెయిన్‌పై ఎనిమిది రోజులుగా సాగిస్తోన్న యుద్ధానికి సంబంధించిన వివరాలను రష్యా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. యుద్ధంలో ఇప్పటివరకు 498 మంది సైనికులను కోల్పోయామని రష్యా ప్రకటించింది. 16 వందల మంది రష్యా సైనికులు గాయపడ్డారని ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఉక్రెయిన్‌కు చెందిన ఎస్-300, బీయూకే-ఎం1 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ వ్యవస్థను రష్యా ధ్వంసం చేసింది. పలు మిలటరీ హెలికాప్టర్లు, నాలుగు డ్రోన్లను నేలకూల్చింది.…