India Russia: ఇండియా రష్యాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఇప్పటికే రక్షణ, ఆయుధాలు, ఎరువులు, చమురు వంటి వాటి భారత్ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. గత కొన్ని దశాబ్ధాలుగా రష్యా భారత్‌కి నమ్మకమైన మిత్రదేశంగా ఉంటోంది. ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. భారత్ రష్యా సంబంధాలను చరిత్రను పరిశీలిస్తే, రష్యా భారత ప్రయోజనాలకు విరుద్ధంతా ఎప్పుడూ ప్రవర్తించలేదని చెప్పారు.