పల్లె దవాఖానలపై మంత్రి హారీష్ రావు కీలక ప్రకటన చేశారు. సిద్ధిపేట జిల్లా మండల కేంద్రమైన చిన్నకోడూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 49 మంది ఆశా కార్యకర్తలకు జియో 4జీ మొబైల్ సిమ్ కార్డుల పంపిణీ చేశారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలకు ప్రభుత్వ వైద్యం చేరువలో తేవాలనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ విజన్ కు అనుగుణంగా భవిష్యత్తులో ప్రతీ పల్లెకు పల్లె దవాఖానలు తెస్తామని స్పష్టం చేశారు హరీష్ రావు.…