Local Body Elections : రాష్ట్రంలో గ్రామ పాలనకు సంబంధించి నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల తొలి విడత ప్రచారం సోమవారంతో ముగిసింది. ఎన్నికల ప్రచారం ముగియడంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. తొలి విడత పోలింగ్ ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరగనుంది. ఈ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 189 మండలాల్లోని 4,235 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది.…