Funds Release: గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క రోజులోనే రూ.153 కోట్లు విడుదల చేస్తూ 9990 పెండింగ్ బిల్లులను క్లియర్ చేసింది. ముఖ్యంగా రూ.10 లక్షల లోపు బిల్లులను ఈ విడతలో చెల్లించడం గమనార్హం. 2024 ఆగస్టు వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం, గత ప్రభుత్వం మిగిల్చిన భారీ మొత్తంలో పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌కు నడుం బిగించింది. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి…
అచ్చంపేట నియోజకవర్గంలో అమ్రాబాద్ మండలం మాచారంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ‘నల్లమల డిక్లరేషన్’ను సైతం ఆవిష్కరించారు. ఈ డిక్లరేషన్ ద్వారా గిరిజనుల సంక్షేమానికి రూ.12,600 కోట్లతో పనులు చేపడతామని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం నల్లమల ప్రాంతం గురించి సీఎం ప్రసంగించారు. ఒకప్పుడు నల్లమల అంటే వెనుకబడిన ప్రాంతం. ఎవరో ఒక నాయకుడు వచ్చి అభివృద్ధి చేయాలని అనేవారని నాటి రోజులను సీఎం గుర్తు చేశారు. సీఎంగా ఇక్కడి నుంచి…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం పెదపాడు గ్రామస్థులందరికీ చెప్పులు పంపిణీ చేశారు. ఇటీవల "అడవితల్లి బాట" అనే కార్యక్రమంలో భాగంగా పవన్ ఆదివాసీ గ్రామం పెదపాడులో పర్యటించిన విషయం విదితమే. ఆ సమయంలో పాంగి మిథు అనే వృద్ధురాలు పవన్‌కళ్యాణ్ కోసం నడిచి వచ్చి స్వాగతం పలికారు.
Bhu Bharathi: నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలో నేడు భూ భారతి పైలట్ ప్రాజెక్టును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు. భూ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడమే కాకుండా, రైతులకు భూమిపై పూర్తి హక్కులను బలపరచే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో పాటు, నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులు ప్రారంభం కానున్నాయి. జూన్ 2వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో ఈ అవగాహన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. గ్రామస్థాయిలో…
Minister Seethakka : వేసవి దాహాన్ని తీర్చేందుకు పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి (పీఆర్‌ఆర్‌డీ) శాఖ ఆధ్వర్యంలో గ్రామాలు, మండల కేంద్రాల్లో భారీ సంఖ్యలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 8,090 చలివేంద్రాలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. వేసవి కాలంలో పనుల నిమిత్తం బయటకు వచ్చే ప్రజలకు తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఈ చర్యలు చేపట్టబడ్డాయి. మంత్రి సీతక్క స్పష్టమైన ఆదేశాలతో పీఆర్‌ఆర్‌డీ అధికారులు గ్రామాల నుంచీ రద్దీ ప్రాంతాల వరకు ప్రతి చోట చలివేంద్రాలను…
పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విభాగాల్లో వివిధ పోస్టులకు ఎంపికైన 922 మందికి అభ్యర్థులకు నేడు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన కొలువుల పండుగ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిల్డ్ నౌ పోర్టల్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అభ్యర్థులు నియామక పత్రాలు గురించి దశాబ్దకాలం ఎదురుచూశారన్నారు. ఉద్యోగ బాధ్యత అనిర్వచనీయ ఆనందాయకమని తెలిపారు.
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో మొత్తం రూ. 630.27 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వర్చువల్గా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని చేపట్టినవి. ముఖ్య అభివృద్ధి పనుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి: విద్యా రంగ అభివృద్ధి రూ. 200 కోట్లు: జాఫర్గఢ్ మండలంలోని కోనాయాచలం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ రూ. 5.5 కోట్లు: ఘన్పూర్…
తాను దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రోడ్డు మార్గాన చేరుకున్నారు. మంత్రి సీతక్క, కిషోర్ ప్రినిపల్ సెకరెట్రి, కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా ఘన స్వాగతం పలికారు. ఆదివాసీలు వారి నృత్యాలతో ఆకట్టుకున్నారు. కుమురం భీమ్, బిర్శా ముండా విగ్రహాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రి సీతక్క ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ అభివృద్ధి నిమిత్తం రూ. కోటి 50 లక్షల విలువైన పనులు ప్రారంభించారు.
ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారికి ఊరట కల్గించేలా ఈ మంత్రి వర్గం నిర్ణయాలు తీసుకుంది.
Kodanda Reddy : రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో పర్యటించిన రైతు కమిషన్.. రైతులతో వ్యవసాయదారులతో కౌలు రైతులతో కలిసి అభిప్రాయ సేకరణ చేపట్టిందని, కూరగాయలు,పండ్లు పులతోటలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెరగాలన్నా, దిగుబడి రావాలన్నా రైతులకు సబ్సీడీ పథకాలు తేవాలన్నారు. అయితే గ్రౌండ్ వాటర్ పై ఆధారపడిన రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అదేవిదంగా చాలావరకు రైతులు ప్రకృతి వ్యవసాయానికి మొగ్గు చూపుతున్నారని గుర్తుచేశారు. దీనికి కూడా…