ఏపీ కాంగ్రెస్ కి జవసత్వాలు ఇచ్చి ముందుకు నడిపించే సారథి కోసం హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఏపీసీసీ చీఫ్ మార్పుపై కాంగ్రెస్ అధినాయకత్వం తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ మార్పుపై నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ. ఏపీసీసీ చీఫ్ పదవికి రేసులో ఐదుగురు నేతలు వున్నారని తెలుస్తోంది. ఏపీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్న వారిలో మాజీ ఎంపీ హర్షకుమార్, జేడీ శీలం, గిడుగు రుద్రరాజు, సుంకర…