కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ), రాష్ట్ర సమాచార కమిషన్ (ఎస్‌ఐసీ)ల్లో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని, లేకుంటే సమాచార హక్కు చట్టం, 2005 ‘మృతపత్రం’గా మారుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.
కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే కుట్రలో భాగంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టాన్ని కొద్దికొద్దిగా చంపేస్తోందని ఖర్గే ఆరోపించారు.
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అంటే ఇదేనేమో. వివిధ రాజకీయపార్టీ అధికార నివాసాలు, పార్టీ కార్యాలయాల అద్దెలు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇంటి అద్దెతో పాటు కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం పెద్ద మొత్తంలో బకాయిపడింది. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తుకు ఈ వివరాలను అందజేసింది కేంద్ర ప్రభుత్వం. వివిధ పార్టీల నాయకులకు ప్రభుత్వపరంగా ఇచ్చే ఇళ్లకు నిర్ణీత సమయం తర్వాత అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అయితే,…
ఆర్టీఐ సమాచారంపై శాఖాధిపతుల ముందస్తు అనుమతి తీసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వం ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించింది. దీంతో తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు వెనక్కి తీసుకుంటున్నట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. అయితే ఆర్టీఐ సమాచారంపై శాఖాధిపతుల ముందస్తు అనుమతి తీసుకోవాలన్న ఉత్తర్వులు వెనక్కి తీసుకున్నట్లు, అవసరమైతే శాఖాధిపతుల సలహా తీసుకోవాలని తాజా ఉత్తర్వులు…