Montha Cyclone: ‘మొంథా’ తుఫాన్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) కేంద్రం నుండి అధికారులతో నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు ఐదుగురు లేదా ఆరుగురు సభ్యులతో కూడిన ప్రభుత్వ బృందాలను తక్షణమే గ్రామాలకే పంపించాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ బృందాలు గ్రామాల్లో అందుబాటులో ఉంటే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.…