నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ మార్గదర్శిని ఎంచుకుందని తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు.. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిననాటి నుంచి ఆర్టీసీని ముందుకు తీసుకువెళ్లేందుకు వినూత్న రీతిలో నిర్ణయాలు తీసుకుంటూ అందరి మన్ననలు పొందుతున్నారు. తాజాగా మరో నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే బాలింతలు రద్దీగా ఉండే బస్టాండ్‌లో పసిపిల్లలకు పాలిచ్చేందుకు అనుగుణంగా ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని…