సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీకి భారీ ఆదాయం వచ్చింది.. ఈ సమయంలో ఆర్టీసీ ఆదాయం రూ.23 కోట్లు దాటినట్టు ఆ సంస్థ ప్రకటించింది.. పండు సమయంలో 7200 బస్సులతో మొదలుపెట్టి 9,097 బస్సులు నడిపింది ఏపీఎస్ఆర్టీసీ.. మొత్తం 23.71 కోట్ల సంక్రాంతి పండుగ సమయంలో ఆదాయాన్ని ఆర్జించింది ఏపీఎస్ఆర్టీసీ..
గత రెండేళ్లుగా కోవిడ్ ప్రభావంతో ఆర్టీసీ గడ్డు కాలమే చూసింది.. అయితే, కోవిడ్ తగ్గుముఖం పట్టడం, ప్రయాణికులు ప్రజా రవాణా ఉపయోగించటంతో మళ్లీ ఆర్టీసీకి మంచి రోజులు వచ్చినట్టు అయింది. తాజాగా పెళ్లిళ్ల సీజన్ రావటం, వేసవి సెలవులతో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య అధికమైంది. ప్రస్తుతం ఎన్టీఆర్, కృష్ణా పరిధిలో అక్యుపెన్సి రేషియో సగటున 70 శాతానికి పైగా చేరుకుంది. ఏప్రిల్, మే నెలల్లో ఏసీ బస్సుల్లో అక్యూపెన్సీ రేషియో 80…