తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త రూల్ తీసుకొచ్చింది. ఉద్యోగులు సకాలంలో విధులకు రాకుంటే రోజుకు రెండుసార్లు రిజిష్టర్‌పై సంతకాలు చేయాలని గట్టి నిర్ణయం తీసుకుంది. ఆ టైమ్ దాటితే ఉద్యోగులు ఇక రావాల్సిన అవసరం లేదంటూ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇక నుంచి ఉద్యోగులు ఆఫీసులకు ఆలస్యంగా రావడానికి వీల్లేదని టీఎస్‌ఆర్టీసీ స్పష్టం చేసింది. రోజూ ఉదయం 10.45 గంటల తర్వాత కార్యాలయానికి రావాల్సిన పని లేదని ఉత్తర్వులు జారీ చేసింది. హాజరు రిజిష్టర్‌పై ఉదయం 10.30…
ఏపీలో ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య పీఆర్సీ రగడ నడుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమానికి చాలా ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. ఉపాధ్యాయ సంఘాలు, విద్యుత్ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు సంఘీభావం ప్రకటించారు. అయితే ఆర్టీసీలో ఓ వర్గం ఉద్యోగులు మాత్రం తాము ఆందోళనల్లో పాల్గొనేది లేదని స్పష్టం చేశాయి. సీఎం జగన్ తమకు మంచే చేశారని… ఉద్యోగ సంఘాల ఉద్యమంలో తాము భాగం కాలేమని ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రకటించింది.…
ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు రీయింబర్స్ మెంట్ పథకం అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన అనంరతం ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్ కార్డులను జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఈహెచ్‌ఎస్‌కు అవకాశం లేని ఆస్పత్రుల్లో ప్రస్తుతం ఉద్యోగుల వైద్యం చేయించుకుంటున్నారు. దీంతో ఇతర ఉద్యోగుల మాదిరిగా వారుకూడా వైద్య ఖర్చులను మెడికల్ రీఎంబర్స్ చేసుకునేలా ప్రభుత్వం తాజా ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో వారు ఆనందం…
నష్టాల్లో కూరుకుపోతున్న టీఎస్‌ఆర్టీసీని గాడిలోపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.. ఇప్పటికే ఆర్టీసీపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్.. ఆర్టీసీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఇక, ఆ తర్వాత మూడు, నాలుగు నెలల్లో ఆర్టీసీ కోలుకోకపోతే.. ప్రైవేట్‌పరం చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారంటూ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు.. సంస్థ బాగుకోసం అంతా కష్టపడి పనిచేయాలని సూచించారు. ఇక, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా రంగంలోకి దిగారు.. ఇప్పటికే…