ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు రీయింబర్స్ మెంట్ పథకం అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన అనంరతం ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్ కార్డులను జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఈహెచ్‌ఎస్‌కు అవకాశం లేని ఆస్పత్రుల్లో ప్రస్తుతం ఉద్యోగుల వైద్యం చేయించుకుంటున్నారు. దీంతో ఇతర ఉద్యోగుల మాదిరిగా వారుకూడా వైద్య ఖర్చులను మెడికల్ రీఎంబర్స్ చేసుకునేలా ప్రభుత్వం తాజా ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read Also:తెలంగాణలో ఎలాంటి మత హింస జరగలేదు: డీజీపీ మహేందర్‌రెడ్డి
కాగా ఇప్పటికే ఏపీ సర్కార్ విశ్రాంత ఉద్యోగులకు 2017 పేస్కేల్ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ బకాయిలను రెండు విడతల్లో చెల్లించనున్నారు. 2019 మార్చి 1 నుంచి 2021 నవంబర్ 30 మధ్య పదవీ విరమణ పొందిన ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 2017 పే స్కేల్ బకాయిలను రెండు విడతలుగా చెల్లించనున్నారు. దీంతో మొత్తం 5వేల మంది రిటైర్డ్ ఉద్యోగుల ఖాతాల్లో తొలి విడత ఇప్పటికే ప్రభుత్వం చెల్లించింది.