RSS On Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దారుణాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త మద్దతు కూడగట్టాలని, అందుకోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) పిలుపునిచ్చింది. అన్యాయంగా నిర్బంధించిన హిందూ సన్యాసి, ఇస్కాన్ మాజీ నేత చిన్మోయ్ కృష్ణదాస్‌ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, జరుగుతున్న హింసను ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే ఖండించారు.