దేశంలో నిరుద్యోగం, కరోనా కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ధరల పెరుగుదల ఎలా వున్నా.. యువతను మత్తులో దించేందుకు ముఠాలు నిరంతరం పనిచేస్తున్నాయి. దేశాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ దందా నానాటికీ పెరిగిపోతోంది. ఎక్కడ అవకాశం వుంటే అక్కడ డ్రగ్స్ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. ఇప్పటికే భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుబడిన గుజరాత్‌లో తాజాగా మరోమారు భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. గుజరాత్‌లో గురువారం నాడు 256 కిలోల హెరాయిన్‌ను నార్కోటిక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ…