ప్రపంచ వ్యాప్తంగా ఎస్.ఎస్.రాజమౌళి చిత్రాలను అభిమానించే వారందరికీ కన్నుల పండుగ చేస్తూ ఆర్.ఆర్.ఆర్. ట్రైలర్ నేడు జనం ముందు నిలచింది. దీనిని చూసిన జనమంతా జనవరి ఏడు ఎప్పుడు వస్తుందా అన్న భావనకు లోనయ్యారంటే అతిశయోక్తి కాదు. ట్రిపుల్ ఆర్ అంటే రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ తో పాటు టైటిల్ కు తగ్గట్టుగానే రౌద్రం... రణం...రుధిరం... అన్నీ కనిపించేలా ట్రైలర్ ను రూపొందించారు రాజమౌళి. ఈ ట్రైలర్ ను చూసిన వెంటనే సినిమా చూసేయాలన్నంత ఉత్సాహానికి…