తెలంగాణలో ఎన్నికలు వచ్చాయంటే చాలు అధికార టీఆర్ఎస్ పార్టీని ‘చపాతీ రోలర్’ వెంటాడుతూనే వస్తోంది.. స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ కేటాయించే ‘రొట్టెల పీట’ (చపాతీ రోలర్) కారు గుర్తుకు తలనొప్పిగా మారుతోంది. ఇప్పటికే తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఓటమి ప్రధాన కారణం ఈ చపాతీ రోలరే అని నిర్ధారణకు వచ్చిన టీఆర్ఎస్ నేతలు.. అంతే కాదు, దుబ్బాక బై…