టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీ వచ్చే ఫిబ్రవరి 7న ప్రారంభమై.. మార్చి 8న ముగుస్తుంది. 2024లో ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. టోర్నమెంట్లో మొత్తం 20 జట్లు పాల్గొననుండగా.. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఈ మ్యాచ్ కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న జరగనుంది. టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ కార్యక్రమంలో…