హిట్ మ్యాన్‌గా పేరొందిన రోహిత్ శర్మకు ఏమైంది.. 2024 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టైటిల్ గెలిచినప్పటి నుండి అతను సరిగా ఆడటం లేదు.. దీంతో.. తన బ్యాట్‌కు ఏదో ఒక శాపం తగిలి ఉంటుందని క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తీవ్ర నిరాశ పరిచిన రోహిత్ శర్మ.. ఆ తర్వాత రంజీలో ఆడాడు. అక్కడ కూడా ఇదే రకమైన ప్రదర్శన కనబరిచాడు.
Rohit Sharma On Retirement: సిడ్నీ టెస్ట్‌కు దూరంగా కూర్చోవడం అంటే తాను రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లు కాదని టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. దీనితో పాటు, తన పేలవమైన ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని సిడ్నీ మ్యాచ్ ఆడకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. తన నిర్ణయాన్ని మ్యాచ్‌కు ఒక రోజు ముందు కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు చెప్పానని తెలిపాడు. దాంతో సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్…
కెప్టెన్ కావడం వల్లే రోహిత్ శర్మ తుది జట్టులో ఉంటున్నాడని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. కెప్టెన్‌గా లేకపోతే ప్లేయింగ్ ఎలెవన్‌లో రోహిత్ స్థానం ప్రశ్నార్థకంగా మారేదన్నాడు. హిట్‌మ్యాన్ బ్యాటర్‌గా తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాడని ఇర్ఫాన్ పేర్కొన్నాడు. రోహిత్ గత కొన్ని నెలలుగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. కివీస్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో ఒక హాఫ్ సెంచరీ మినహా రాణించలేదు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో కనీసం 20, 30 పరుగులు కూడా చేయట్లేదు.…