టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. భారత్, శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7 నుంచి మెగా టోర్నీ ఆరంభం కానుంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను భారత్ సన్నాహంగా ఉపయోగించుకుంటోంది. ఇటీవలి కాలంలో వరుస విజయాలు, డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న టీమిండియా.. సునాయాసంగా సెమీ ఫైనల్‌కు దూసుకెళుతుందని మాజీలు అభిప్రాయపడుతున్నారు. అయితే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం భారత్‌కు కొన్ని సవాళ్లు ఎదురుకానున్నాయని…