అరుణాచలంలో తెలంగాణ భక్తుడు దారుణ హత్యకు గురయ్యాడు. భక్తుడి వెంట ఉన్న నగదు కొసమే ఈ హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రయోజకుడు అయ్యాడు... కొడుకుకు పెళ్లి చేద్దాం అనుకున్న సమయంలో జరిగిన ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి గిరి ప్రదక్షిణలో యాదాద్రి జిల్లాకు చెందిన ఓ భక్తుడు దారుణ హత్యకు గురయ్యాడు.
గుంటూరు జిల్లా మంగళగిరి కేంద్రంలోని హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ లో ముగ్గురు దొంగలు చోరీకి ప్రయత్నించి విఫలం అయ్యారు. షట్టర్ తాళాలు పగలగొట్టి బ్యాంక్ లోకి ముగ్గురు దొంగలు ప్రవేశించారు. బ్యాంక్ లోకి ముగ్గురు దొంగలు వెళ్తుండగా పోలీస్ పెట్రోలింగ్ సైరన్ మోగడంతో అక్కడి నుంచి పారిపోయారు.