హైదరాబాద్ జూబ్లీహిల్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్ నంబర్ 82లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. జర్నలిస్టు కాలనీ బస్టాప్ ఎదురుగా ఉన్న బహుళ అంతస్తుల భవనంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో.. స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. అయితే.. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరగడంతో.. పార్కింగ్ ఏరియాలో మంటలు చెలరేగాయి. మంటలను చూసిన సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగులు వెంటనే బయటకు పరుగులు తీశారు. కాగా.. ఈ ప్రమాదంపై వెంటనే…