Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో గత మూడు రోజులుగా వాతావరణం ఉగ్రరూపం దాల్చింది. గత 12 గంటలుగా కుండపోత వర్షాలు, భారీ హిమపాతం రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. రాష్ట్రంలోని ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురుస్తుండగా, లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరోవైపు లాహౌల్ స్పీతి, చంబా-పాంగీ, కిన్నౌర్ జిల్లాల్లో కురుస్తున్న భారీ మంచు కారణంగా రహదారులు మూసివేయబడ్డాయి. దీంతో ఈ ప్రాంతాలు మిగతా ప్రపంచంతో సంబంధాన్ని కోల్పోయాయి. గత 24 గంటల్లో లాహౌల్ స్పీతి, కిన్నౌర్, చంబా, కాంగ్రా,…