హర్యానాలోని నూహ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్, రోల్స్ రాయిస్ కారు ఢీకొన్న ఘటనలో ట్యాంకర్లో ఉన్న ఇద్దరు మరణించగా.. లగ్జరీ కారులోని ప్రయాణికులు ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.
One Person Died after Bike Hits Bus in Shamirpet: శామీర్‌పేటలోని జీనోమ్ వ్యాలీ ఠాణా పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ ఢీ కొట్టడంతో ఓ బస్సు పూర్తిగా దగ్ధమైంది. బైక్ పెట్రోల్ ట్యాంక్ లీకై మంటలు చెలరేగి బస్సుకు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి… సిద్దిపేట జిల్లా ములుగు…
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలో బాంబు పేలుడు జరిగింది. వజీరిస్థాన్‌లోని గుల్మిర్‌కోట్ ప్రాంతంలో ఓ వ్యాన్ కార్మికులతో వెళ్తున్న వ్యాన్‌ను ఉగ్రవాదులు పేల్చివేశారు. శనివారం షావాల్ తహసీల్‌లోని గుల్మీర్ కోట్ సమీపంలో 16 మంది కూలీలతో వెళ్తున్న వాహనాన్ని ఉగ్రవాదులు పేల్చివేశారని డిప్యూటీ కమిషనర్ రెహాన్ గుల్ ఖట్టక్ తెలిపారు.
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు స్పాట్ లోనే చనిపోయారు.. రెండేళ్ల బాలుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.. బుధవారం భరూచ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, రెండేళ్ల బాలుడు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు తెలిపారు.. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ లోని భరూచ్ జిల్లాలో బుధవారం రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు…
AHMEDABAD: ఇంటి నుంచి బయటకు రావాలంటే జనాలు భయపడుతున్నారు.. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.. మన జాగ్రత్తల్లో మనం ఉన్నా కూడా ప్రమాదాలు ఎప్పుడు ఎక్కడ నుంచి వస్తాయో ఊహించడం కష్టం అవుతుంది.. నిత్యం ఎక్కడో చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. ఎంతో మంధి ప్రాణాలను కోల్పోతున్నారు.. తాజాగా గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదం వల్ల పది మంది ప్రాణాలను కోల్పోయారు.. ఈ ప్రమాదంతో జనాలు ఉలిక్కి పడ్డారు.. వివరాల్లోకి…
తమిళనాడులో ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలోని చెంగల్పట్టులో ఇవాళ (శుక్రవారం) జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. టిప్పర్ లారీ డ్రైవర్ వాహనంపై అదుపు తప్పి ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వధువు చనిపోయింది. సీతానగరం మండలం గుచ్చిమివలస దగ్గర ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించే లోపు భార్య కొత్తకోట అమూల్య(29) మృతి చెందింది.
2 Dead and 5 injured in Kurnool Road Accident Today: కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అటుగా వెళుతున్న ప్రయాణికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. కర్ణాటకలోని బళ్లారి నుంచి ఏడుగురు యువకులు కారులో మంత్రాలయం…
ఆఫ్రికాలోని మొరాకో దేశంలో అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మొరాకోలోని అజిలాల్ సెంట్రల్ ప్రావిన్స్‌లో జరిగిన అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదంలో 24 మంది మరణించారని అధికారులు వెల్లడించారు.