పార్లమెంట్ లో రాజదండం(సెంగోల్) ఉంచడంపై మళ్లీ దుమారం రేగుతోంది. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు ఆర్కే చౌదరి చేసిన వ్యాఖ్యలు దీనికి కారణం అయ్యాయి. పార్లమెంటు నుంచి రాజదండం తొలగించాలంటూ ఆయన రాసిన లేఖకు బీజేపీ బదులిచ్చింది. ఇదిలా ఉండగా.. దీనిపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనిపై మండిపడ్డారు. భారతీయ చరిత్రను, తమిళ సంస్కృతిని సమాజ్‌వాదీ పార్టీ, ఇండియా కూటమి అగౌరవపరుస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.