(మార్చి 10న రితూ వర్మ పుట్టినరోజు)ప్రతిభ ఉండాలే కానీ, షార్ట్ ఫిలిమ్స్ తోనూ గుర్తింపు సంపాదించ వచ్చు. అలా ఈ మధ్యకాలంలో రాణించిన వారిలో నటి రితూ వర్మ పేరు ముందుగా చెప్పుకోవాలి. అనుకోకుండా అనే లఘు చిత్రంలో తొలిసారి రితూ వర్మ నటించింది. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రితూ అభినయానికి మంచి మార్కులూ పడ్డాయి. 2013లో కాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లోనూ అనుకోకుండా ప్రదర్శితమయింది. తరువాత విజయ్ దేవరకొండను హీరోగా నిలిపిన పెళ్ళిచూపులులో…