‘బొమ్మరిల్లు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో హాసినిగా నిలిచిపోయింది జెనీలియా.. ఆ తరువాత పలు సినిమాల్లో నటించిన అమ్మడు బాలీవుడ్ స్టార్ హీరో రితేశ్ దేశముఖ్ ను వివాహం చేసుకొని నటనకి దూరమైంది. ఇక పిలల్లు పుట్టాకా ఇంటిపట్టునే ఉంటూ వారి ఆలనా పాలన చూసుకోవడం మొదలుపెట్టింది. ఇక దీంతో పాటు భర్త బిజినెస్ లను చూసుకుంటూ బిజీగా ఉన్న జెనీలియా మరోసారి సినిమాలపై దృష్టి పెట్టనుంది. ఈ నేపథ్యంలోనే అమ్మడు రీ ఎంట్రీకి రంగం సిద్ధం…