గాయం కారణంగా భారత జట్టు నుంచి తప్పుకున్న స్టార్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో త్వరలో జరిగే రెడ్ బాల్ సిరీస్‌లో భారత్-ఎ జట్టు తరఫున పంత్ బరిలోకి దిగనున్నాడు. అంతేకాదు ఈ సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వైస్ కెప్టెన్‌గా సాయి సుదర్శన్ ఎంపికయ్యాడు. గత జూలైలో అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లోని మాంచెస్టర్ టెస్ట్ (నాలుగో టెస్టు)లో పంత్ పాదానికి గాయమైన విషయం తెలిసిందే. అక్టోబర్ 30న బెంగళూరులోని…