‘కాంతార: చాప్టర్ 1’ విడుదలైనప్పటి నుంచి నిజంగా ఒక ఫెనామెనన్‌లా మారింది. రిషబ్ శెట్టి తన దర్శకత్వం, నటన తో మరోసారి ప్రేక్షకులను తన మాయలో పడేశాడు. దసరా కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్, అంచనాలకన్నా ఎక్కువగా పాజిటివ్ టాక్ సంపాదించుకుని, రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ప్రత్యేకంగా కర్ణాటకలో ఈ సినిమా కలెక్షన్ల తుఫాన్ సృష్టిస్తోంది. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం, ‘కాంతార: చాప్టర్ 1’ కర్ణాటకలో ‘కేజీఎఫ్ 2’ లాంటి బ్లాక్‌బస్టర్…