నందమూరి తారకరత్న కార్డియాక్ అరెస్ట్ తో ఆసుపత్రిలో 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మహా శివరాత్రి పర్వదిననా తుది శ్వాస విడిచారు. తిరిగి వస్తాడు అనుకున్న మనిషి అకాల మరణం నందమూరి అభిమానులని, కుటుంబ సభ్యులని, తెలుగు దేశం పార్టీ కేడర్ ని, సినీ పరిశ్రమని దిగ్బ్రాంతికి గురి చేసింది. 39 ఏళ్లకే మరణించిన తారకరత్న భౌతికకాయాన్ని మోకిలలోని సొంత ఇంటి నుంచి ఫిల్మ్ ఛాంబర్ కి తీసుకోని వచ్చారు. తారకరత్న హాస్పిటల్ లో ఉన్నప్పటి…