విజయ్ కాంత్… కోలీవుడ్ హీరో అయినా తెలుగు వాళ్లకు కూడా దగ్గరయ్యారు. హీరోగానే కాకుండా… దర్శకుడిగా, నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు. మరోవైపు రాజకీయ పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేయాలి అనుకున్నారు. ఓ భాషలో స్టార్ ఇమేజ్ వచ్చాక… ఇతర భాషలలో కూడా మార్కెట్ సంపాదించుకోవాలి అనుకుంటారు. అందుకోసం..అక్కడ డైరెక్ట్ గా సినిమాలు చేస్తారు కాని… కెప్టెన్ విజయ్ కాంత్ మాత్రం సొంత భాషను వదిలి పెట్టలేదు. కోలీవుడ్లో తప్ప మరో లాంగ్వెజ్లో మూవీ చేయలేదు.…