ఒక్క ఘటనతో ఎన్నో సమస్యలు తెరమీదకు వచ్చాయి, కోనసీమ జిల్లా వాసులకు ఇంటర్నెట్ కష్టాలు తీరడం లేదు. నెట్ కోసం గోదారి గట్టు చేరుకుంటున్నారు జనం. అమలాపురంలో కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం అయింది. కోనసీమ జిల్లాలో ఇటీవల జరిగిన అల్లర్ల కారణంగా ఇంటర్నెట్ సేవలు బంద్ కావడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్నెట్ ఎక్కడ వస్తే అక్కడికి చేరుకుంటున్నారు జనం. గోదావరి గట్ల మీదకు వచ్చి నెట్ సిగ్నల్స్…