India Billionaires 2025: భారతదేశం బిలియనీర్లకు కొత్త కేంద్రంగా మారుతోంది. దేశంలో సంపన్న వ్యక్తుల సంఖ్య ఏడాది నుంచి వేగంగా పెరుగుతోంది. తాజాగా M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 విడుదలైంది. ఈ లిస్ట్ ప్రకారం.. భారతీయ బిలియనీర్ల సంఖ్య 350 కంటే ఎక్కువకు పెరిగింది. ఈ సంఖ్య గత 13 సంవత్సరాలలో ఆరు రెట్లు పెరిగింది. ముఖేష్ అంబానీ మరోసారి అత్యంత ధనవంతుల ర్యాంకింగ్‌లో ఆధిపత్యం చెలాయించారు. నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు.