గత యేడాది లాగే ఈ సారి కూడా లాక్ డౌన్ సినిమా రంగాన్ని కుదేలు చేసింది. అయినా కొన్ని సినిమాలు వెలుగులు విరజిమ్మాయి. మరికొన్ని ఓటీటీల్లో సందడి చేశాయి. ఇంకొన్ని బాక్సాఫీస్ బరిలో మిశ్రమ ఫలితాలు చూశాయి. అందరు స్టార్ హీరోస్ సినిమాలు బాక్సాఫీస్ బరిలో దూకలేకపోయాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం దాదాపు టాలీవుడ్ లో స్టార్ హీరోస్ అనిపించుకున్నవారందరూ ఏదో విధంగా వినోదం పంచారనే చెప్పాలి. టాప్ హీరోస్ లో కొందరి సినిమాలు థియేటర్లలో…