కొందరు మూఢనమ్మకాలను బాగా నమ్ముతారు. అయితే వారిలో కొంతమంది లాజిక్కులతో పని లేకుండా మూఢ నమ్మకాలను గుడ్డిగా పాటిస్తుంటారు. ఇలాంటి ఘటనే హర్యానాలో చోటుచేసుకుంది. ఎవరో చెప్పిన మాట విని కరెంట్ షాక్‌తో చనిపోయిన యువకుడి బాడీని ఆవుపేడలో పాతిపెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. హర్యానా సిర్సా జిల్లాలోని మండికలాన్ వలీ ప్రాంతంలో జగ్జీత్ సింగ్ అనే 32 ఏళ్ల యువకుడు కరెంట్ షాక్‌కు గురయ్యాడు. కరెంట్ తీగపై తడి టవల్ ఆరేసే ప్రయత్నంలో అతడికి షాక్ కొట్టింది.…