తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు నిర్వహణపై కమిటీలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష చేపట్టారు. ఒంగోలు సమీపంలోని మండవారి పాలెంలోనే మహానాడు నిర్వహణకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఒంగోలు నగర సమీపంలోని మండవారి పాలెంలో 27,28 తేదీల్లో మహానాడు జరగనుంది. సమయం తక్కువగా వుండడంతో పనులు వేగవంతం చేయాలన్నారు చంద్రబాబు. మొదటి రోజు ప్రతినిధుల సభ, రెండో రోజు బహిరంగ సభ వుంటుందన్నారు. మహానాడు నిర్వహణకు ఒంగోలు మినీ స్టేడియం ఇవ్వాలని కోరారు టీడీపీ నేతలు. అయితే, స్టేడియం…