Today(15-03-23) Stock Market Roundup: ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఈ వారం వరుసగా 3 రోజుల నుంచి ఒకే రకమైన ట్రేడింగ్ వాతావరణం నెలకొంది. ఉదయం ఉత్సాహంగా ప్రారంభం కావటం.. మధ్యాహ్నానికి డీలా పడిపోవటం.. ఇదే జరుగుతోంది. ఇవాళ బుధవారం రెండు కీలక సూచీలు లాభాలతో ప్రారంభమైనప్పటికీ సాయంత్రం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఎఫ్‌ఎంసీజీ సెక్టార్ స్టాక్స్ మరియు రిలయెన్స్, ఎయిర్‌టెల్ షేర్లు బలహీనపడటంతో సెన్సెక్స్, నిఫ్టీ రోజురోజుకీ నేలచూపులు చూస్తున్నాయి.