సామాన్యులకు మేలు జరిగేలా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇవాళ 33 జిల్లాల తహశీల్దార్లతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అంగుళం ప్రభుత్వ భూమి కూడా ఆక్రమణకు గురి కావొద్దని, కలెక్టర్ అనుమతితోనే తహశీల్దార్ల పై కేసులు నమోదు చేయాలన్నారు. రెవెన్యూ ఉద్యోగులకు ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తహశీల్దార్ల బదిలీలపై…